Monday, September 23, 2019
Follow Us on :

కోహ్లీకి గాయం..  ఎంత తీవ్రమైనదంటే

By BhaaratToday | Published On Aug 15th, 2019

విండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ సెంచరీలతో కదం తొక్కాడు.  కోహ్లి వన్డేల్లో 43 సెంచరీలు సాధించి మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 49 సెంచరీల మార్కుకు అతి దగ్గరగా వచ్చాడు. ఇదే ఊపు కొనసాగితే ఈ ఏడాది లోనే 50 సెంచరీలు పూర్తీ చేసే అవకాశం ఉంది.  అలాగే దశాబ్ద కాలంలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.  

అయితే మూడో వన్డే సందర్భంగా కోహ్లీ చేతికి గాయమైంది. అతడి వేలికి దెబ్బ తగిలింది. కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా విండీస్ ఫాస్ట్ బౌలర్ కీమార్ రోచ్ వేసిన బంతి కోహ్లీ చేతికి బలంగా తాకింది. ఫిజియో ఆ గాయానికి ప్రథమచికిత్స చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత స్కానింగ్ కూడా నిర్వహించారు. ఈ ఘటనపై కోహ్లీ మాట్లాడుతూ, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం లేదని తేలిందని, వేలి ఎముక విరగలేదని పరీక్షలో వెల్లడైందని తెలిపాడు. ఎముక విరిగివుంటే బ్యాటింగ్ కొనసాగించేవాడ్ని కాదన్నాడు. విండీస్ తో తొలి టెస్టులో తప్పకుండా ఆడతానని కోహ్లీ చెప్పుకొచ్చాడు.