Friday, July 19, 2019
Follow Us on :

ఐపీఎల్ పూర్తీ షెడ్యూల్ వచ్చేసింది..!

By BhaaratToday | Published On Mar 19th, 2019

 ఇండియన్ ప్రీమియర్ లీగ్ పూర్తీ షెడ్యూల్ విడుదలైంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఇటీవల రెండు వారాల షెడ్యూల్‌ని విడుదల చేసిన బీసీసీఐ.. తాజాగా గ్రూప్ దశ వరకూ పూర్తీ షెడ్యూల్‌ని ప్రకటించింది. 23వ తేదీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొననుంది. గ్రూప్ దశ వరకూ మ్యాచ్‌లు సాయంత్రం 4 గంటలకి, రాత్రి 8 గంటలకి ప్రారంభంకానున్నాయి. మార్చి 23 నుంచి.. మే 5న గ్రూప్ స్టేజ్ ఆఖరి లీగ్ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్స్, ఎలిమినేటర్, ఫైనల్‌ మ్యాచ్‌ల తేదీలు, వేదికల్ని త్వరలో ప్రకటిస్తారు.