Tuesday, May 21, 2019
Follow Us on :

నా స‌త్తా ఏంటో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు త్వరలోనే తెలుస్తుంది

By BhaaratToday | Published On Mar 14th, 2019

చతేశ్వర్‌ పుజారా.. భారత టెస్టు జట్టులో ఎంత విలువైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే వన్డే, టీ20 జట్లలో అతడికి చోటు లేదు. కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో సైతం అతడికి అవకాశం రావ‌డం లేదు. ఐపీఎల్‌ వేలంలో వరుసగా రెండో ఏడాది కూడా అతను అమ్ముడుపోలేదు. ఐతే ఈ ఏడాది ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీల్లో పుజారా చెలరేగిపోయాడు. 61బంతుల్లోనే సెంచరీ చేయడమే కాక.. మరికొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. తాను టీ20ల్లోనూ ఎవరికీ తీసిపోని రీతిలో ఆడగలనని.. తన సత్తా ఏంటో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు త్వరలోనే తెలుసుకుంటాయని పుజారా అంటున్నాడు. 

‘‘కొన్ని విషయాల్ని జీర్ణించుకోవడం కష్టమే. కానీ ముందుకు సాగిపోవాల్సిందే. జనాలు నా గురించి ఏమనుకుంటారని నేను పెద్దగా ఆలోచించను. ఐతే నా పట్ల జనాల ఆలోచన మారుతోంది. టీ20ల్లోనూ పరుగులు చేసేసరికి ఇది నాకు సాధ్యమే అనుకుంటున్నారు. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు కూడా త్వరలోనే ఈ విషయాన్ని తెలుసుకుంటాయి. ప్రపంచకప్‌ తర్వాత భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులోనూ అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నా. అదే జరిగితే సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని పుజారా అన్నాడు.