Tuesday, October 15, 2019
Follow Us on :

ఈ ఐపీఎల్ లో ఆరంభ వేడుకలు ఉండవు.. మంచి నిర్ణయమే

By BhaaratToday | Published On Feb 22nd, 2019

క్రికెట్ అభిమానులను అలరించడానికి ఐపీఎల్  త్వరలోనే మొదలవుతోంది. ఐపీఎల్ అంటేనే అంగరంగ వైభవంగా ఓపెనింగ్ సెర్మనీ ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో నగరంలో బాలీవుడ్ లేదా ఆ రాష్ట్ర స్టార్స్ తోనో .. ట్యాలెంటెడ్ ఆర్టిస్టులతోనో పెర్ఫార్మెన్స్ లు ఉంటాయి. వీటి కోసం ఎంతో ఖర్చు చేస్తుంది బీసీసీఐ. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో అలాంటి ప్రారంభ వేడుకలు ఉండవు. 2019 ఐపీఎల్ ఎడిషన్ లో ప్రారంభ వేడుకలను రద్దు చేయనున్నారు. ఇలా వేడుకలు రద్దు చేయడానికి ఓ మంచి కారణం ఉంది. 

ఈ కార్యక్రమానికి కేటాయించిన డబ్బును పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవానుల కుటుంబాలకు అందజేస్తామని పాలకుల కమిటీ అధినేత వినోద్ రాయ్ తెలిపారు. అమర జవానుల గౌరవార్థం వేడుకలను రద్దు చేసినట్టు ఆయన వెల్లడించారు. మార్చి 23న ఐపీఎల్ 12వ ఎడిషన్ ప్రారంభం కానుంది. టోర్నీకి సంబంధించిన రెండు వారాల షెడ్యూల్‌ను ఇటీవల విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక పూర్తి మ్యాచ్‌ల జాబితాను విడుదల చేస్తామని బీసీసీఐ తెలిపింది. 

ఇక పుల్వామా ఘటనలో అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ ముందుకొచ్చింది. కనీసం రూ.5 కోట్లకు తగ్గకుండా విరాళం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఆర్థికపరమైన అధికారాలు తమ చేతిలో లేకపోవడంతో సుప్రీం కోర్టు నియమించిన పరిపాలక కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ కి బీసీసీఐ తాత్కాలిక ఛీఫ్ సీకే ఖన్నా లేఖ రాశారు. ప్రభుత్వ సంస్థల ద్వారా తమ విరాళాన్ని బాధితులకు అందేలా చూస్తామని ఖన్నా తెలిపారు.