Wednesday, October 16, 2019
Follow Us on :

కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎవరిని నియమించనున్నారో తెలుసా..?

By BhaaratToday | Published On Aug 10th, 2019

ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో హై టెన్షన్ ఉంది. ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. అయితే కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎవరిని నియమించనున్నారో తెలుసా..? రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్..! ఈయన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. జమ్మూకశ్మీర్, లడఖ్ పేరిట రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాలకు వేర్వేరుగా లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించనున్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్, లఢక్‌ వ్యవహారాలను గవర్నర్‌ సత్యపాల్ మాలిక్ చూస్తున్నారు. జమ్మూకశ్మీర్ కు విజయ్ కుమార్ పేరు ఖరారైనట్టు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

Image result for jammu kashmir lieutenant governor
తమిళనాడుకు చెందిన విజయ్ కుమార్ 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలను, అధికారులను, పోలీసులను దశాబ్దాల పాటు హడలెత్తించిన కరుడుగట్టిన స్మగ్లర్ వీరప్పన్ ను అడ్డుతొలగించడంలో విజయ్ కుమార్ సక్సెస్ అయ్యారు. అలాగే చెన్నై కమిషనర్ గా పనిచేసిన కాలంలో ఎంతోమంది క్రిమినల్స్ ను ఆయన ఎన్ కౌంటర్ చేశారు.

Image result for jammu kashmir lieutenant governor

2008లో హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ చీఫ్‌గా నియమితులయ్యారు. 2010నాటి దంతెవాడ ఘటన తర్వాత విజయ్ కుమార్ సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా 2010-2012 మధ్య కాలంలో మావోయిస్టుల ఏరివేత, అటు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆటకట్టించడంలో కీలక పాత్ర పోషించారు. 2018లో కశ్మీర్ గవర్నర్‌కు భద్రతా వ్యవహారాల సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు.

Image result for jammu kashmir lieutenant governor