Saturday, December 14, 2019
Follow Us on :

పాకిస్థాన్ పెట్టిన బ్యానర్లను తీసివేయించిన ఇరాన్.. పాక్ కు స్ట్రాంగ్ వార్నింగ్

By BhaaratToday | Published On Sep 9th, 2019

జమ్మూకశ్మీర్ విషయంలో భారత్ ను ఇరుకున పెట్టేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. పలు దేశాల మద్దతు కోసం ప్రయత్నించింది కానీ.. పాకిస్థాన్ నిజస్వరూపం తెలిసిన ఏ దేశం కూడా పాక్ కు సపోర్ట్ ఇవ్వలేదు. దీంతో చేసేది లేక పాకిస్థాన్ వివిధ దేశాల్లోని తన రాయబార కార్యాలయాల్లో భారత వ్యతిరేక బ్యానర్లను, పోస్టర్లను ఏర్పాటు చేసింది. 

ఈ ఘటనను ఇరాన్ తీవ్రంగా తప్పుబట్టింది. మషాద్ నగరంలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారత వ్యతిరేక బ్యానర్లను ఇరాన్ అధికారులు తొలగించారు. రాయబార కార్యాలయం గోడలపై ఉంచిన ఈ బ్యానర్లను ఆగస్ట్ 15వ తేదీ అర్ధరాత్రి బలవంతంగా తొలగించారు. 'కశ్మీర్ సంఘీభావ దినం' పేరిట పాక్ ఈ బ్యానర్లను ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా బ్లాక్ డే అంటూ అప్పట్లో తెగ ఓవరాక్షన్ చేశాడు కూడానూ..! అంతేకాకుండా ఈ విషయమై పాక్ కు ఇరాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి పనులు దౌత్యనీతిని దెబ్బతీస్తాయని.. ఓ దేశం గురించి ఇలాంటి బ్యానర్లను ఏర్పాటు చేయడం దౌత్య సిద్ధాంతాలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది.