Sunday, December 08, 2019
Follow Us on :

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం..71 మంది మృతి

By BhaaratToday | Published On Mar 22nd, 2019

ఇరాక్ లో కుర్ద్ నూతన సంవత్సర వేడుకల్లో తీరని విషాదం చోటుచేసుకుంది. ఉత్తర భాగంలోని మోసుల్ వద్ద టైగ్రిస్‌ నదిపై వెళుతున్న ఓ నౌక గురువారం నదీ ప్రవాహానికి పల్టీ కొట్టింది. ఈ నౌక‌ మునిగిపోవడంతో 71 మంది మ‌ర‌ణించారు. సహాయక చర్యల్లో భాగంగా స్థానికులు, పోలీసులు 55 మందిని కాపాడారు. మృతుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. కుర్ద్ ప్రజలు తమ సంస్కృతిని అనుసరించి కొత్త సంవత్సరం 'నౌరుజ్' వేడుకలు జరుపుకుంటూ ఫెర్రీపైకి పరిమితికి మించి ఎక్కారు. అయితే ఆ ఫెర్రీ మోసుల్ నగరం వద్దకు రాగానే నీట మునగడం ప్రారంభించింది. సమీపంలో బోట్లు ఎక్కువగా లేకపోవడంతో ప్రజలను కాపాడడం కష్టమైపోయింది. అందుబాటులో ఉన్న బోట్లతోనే కొందరిని కాపాడే లోగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో నౌకలో 150 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారని ఇరాక్‌ ఆరోగ్యశాఖ మంత్రి సయిఫ్‌–అల్‌–బదర్‌ తెలిపారు.