Monday, September 23, 2019
Follow Us on :

ఐఎస్ఐ పని మొదలుపెట్టింది..!

By BhaaratToday | Published On Sep 10th, 2019

ప్రస్తుతం పాకిస్థాన్-భారత్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే..! భారత్ మీద పాకిస్థాన్ ఎన్నో కుట్రలు పన్నుతోంది. భారత్ లోకి తీవ్రవాదులను పంపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. భారత్ లోని స్లీపర్ సెల్స్ ను కూడా యాక్టివేట్ చేసింది పాక్.  కాశ్మీర్ లో శాంతి అన్నది లేకుండా చేయాలని.. భారత్ లో ఉగ్రదాడులు జరిపి శాంతిని హరించాలని ప్రయత్నిస్తోంది. అక్కడితో ఆగకుండా భారత్ లోకి తీవ్రవాదులను పంపించాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఇప్పుడు పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ కూడా భారత్ లో అలజడి సృష్టించడానికి పని మొదలుపెట్టింది. ఐఎస్ఐ ఉగ్ర సంస్థలతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఖలిస్థానీ జిందాబాద్ ఫోర్స్ తీవ్రవాద సంస్థలు హాజరయ్యాయి. ఏ క్షణమైనా భారత్ పై ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. 

ఇప్పటికే జైషే మొహమ్మద్ ఛీఫ్ మౌలానా మసూద్ అజర్ ను పాకిస్థాన్ తమ కస్టడీ నుండి విడుదల చేసినట్లు రిపోర్ట్స్ అందాయి. భారత్ లో టెర్రరిస్టు కార్యకలాపాలకు ప్లాన్ చేయడానికి పాక్ మసూద్ అజర్ కు అన్ని సహాయసహకారాలు అందించనుంది. రాజస్థాన్ దగ్గర బోర్డర్ లోకి పాకిస్థాన్ పెద్ద ఎత్తున బలగాలను తరలించింది. సియాల్ కోట్-జమ్మూ-రాజస్థాన్ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయాలని ప్లాన్ వేసినట్లు ఇప్పట్లే ఇంటెలిజెన్స్ కు సమాచారం అందింది.