Sunday, August 25, 2019
Follow Us on :

హీరో డిప్పలో సిమ్ కార్డు.. ఇస్మార్ట్ శంకర్ వచ్చేశాడు..!

By BhaaratToday | Published On Jul 3rd, 2019

పూరీ జగన్నాథ్.. ఈయన సినిమాలకు.. సినిమాల్లో ఉన్న డైలాగ్ లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతాకాదు. అయితే ఇటీవలి కాలంలో ఆయనకు సరైన హిట్స్ లేవు..! మునుపటి పూరీ జగన్నాథ్ స్టైల్ మాస్ సినిమా చూడాలని తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ లోటును తీర్చడానికి..  హైదరాబాదీ బిరియానీ లాంటి సినిమా అందించడానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో జతకలిసాడు. 'ఇస్మార్ట్ శంకర్' ను తెరకెక్కించాడు. ఇప్పటికే టీజర్ కూ, ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది. 

రామ్ ను ఇప్పటి వరకూ తెరపై చూడని రీతిలో పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో చూపించాడు. రామ్ కూడా పూరీ హీరో ఎలా ఉండాలో అలానే దిగిపోయాడు. ఆ హైదరాబాదీ స్టైల్ డైలాగ్స్ అయితే ట్రైలర్ లోనే ఇలా ఉన్నాయంటే సినిమాలో రచ్చ రచ్చే..! యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా తెరకెక్కించారు. హీరోయిన్లుగా నభా నటేష్, నిధి అగర్వాల్ లు నటించారు. జులై 18న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టాలని ప్రతి ఒక్క పూరీ అభిమాని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.