Wednesday, October 16, 2019
Follow Us on :

ఇస్మార్ట్ శంకర్.. వీడియో సాంగ్స్ ప్రభంజనమే..!

By BhaaratToday | Published On Sep 24th, 2019

ఇస్మార్ట్ శంకర్...ఈ సంవత్సరం విడుదలయిన సినిమాలలో డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించిన సినిమా..ఈ సినిమాతో పూరీ అభిమానులు అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ అభిమానులకు ఒక హైదరాబాదీ దమ్ బిర్యానిలా దొరికింది. అంతే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. దీంతో అటు హీరో రామ్ ను, ఇటు దర్శకుడిని పైఫల్యాల పరంపర నుండి బయటపడేసింది. 

ఈ చిత్ర విజయానికి  పూరి డైరెక్షన్ తో పాటు... మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం కూడా పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. మణిశర్మ అందించిన పాటలు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ ఒక రేంజ్ లో మాస్ ప్రేక్షకులను ఊపేసాయి. ఎంతో హిట్టయ్యిన వీడియో సాంగ్స్ కోసం మాత్రం మ్యూజిక్ లవర్స్ చాలా ఎక్కువ రోజులే ఎదురు చూసారు. వీడియో సాంగ్స్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూశారు.

సినిమాలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది మాస్ సాంగ్ అయిన  దిమాక్ ఖరాబ్. ఈ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. దీనికి రెస్పాన్స్ ఓ రేంజ్ లో వస్తోంది. కేవలం ఒక్క రోజులోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ మరియు లక్షలలో లైక్స్ ను సాధించింది. ఈ సినిమా మాస్ ను ఎంతవరకు ఉర్రూతలూగించిందో తెలుస్తుంది. ఇక ఆ సాంగ్ కు  వ్యూస్ పరంపర కొనసాగుతోంది.  డిజిటల్ మీడియాలోను దూసుకెళ్తోంది వీడియో సాంగ్..దీంతో ఇస్మార్ట్ శంకర్ మ్యానియా ఇంకా ఏ రేంజ్ లో ఉందో రుచి చూపిస్తుంది. అయితే ప్రస్తుతం 11 మిలియన్ వ్యూస్ తో మరియు 2 లక్షల 50 వేలు పైగా లైక్స్ తో దూసుకుపోతోంది . ఇక ఈ పాట మాత్ర ఖచ్చితంగా 100 మిలియన్ మార్కును అందుకుంటుందని సంగీత ప్రియులు చెప్తున్నారు. మొత్తానికి మాత్రం ఇస్మార్ట్ శంకర్ మ్యానియా ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదని అంటున్నారు. టైటిల్ సాంగ్ విడుదల కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.. ఆ సాంగ్ లో రామ్ మామూలుగా స్టెప్స్ వేయలేదు. అది కూడా భారీ హిట్ ఖచ్చితంగా అవుతుంది.