Tuesday, June 18, 2019
Follow Us on :

చేతిలో ఏముందో చూశారు కదా.. బ్యాంకునే లేపేస్తా.. డబ్బులివ్వండి

By BhaaratToday | Published On Jun 12th, 2019

బ్రహ్మానందం రగడ సినిమాలో సోప్ ను గన్ గా చూపించి.. పోలీసులను బెదిరిస్తాడే అచ్చం అలాగే ఓ వ్యక్తి తన దగ్గర హ్యాండ్ గ్రెనేడ్(బాంబు) ఉందంటూ రెండు  బ్యాంకుల సిబ్బందిని బెదిరించాడు. దాదాపు ఆరు లక్షల రూపాయలను కొట్టేశాడు.. అయితే అతడు బెదిరించింది దేంతోనో తెలుసా..? అవకాడో పండుతో..! హా అవకాడో పండును హ్యాండ్ గ్రెనేడ్ గా చూపించి లూటీ చేశాడు ఆ వ్యక్తి. ఇజ్రాయెల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.       

Image result for avocado

ఇజ్రాయెల్ కు చెందిన ఓ వ్యక్తి అక్కడి బీర్షీబా బ్యాంకులోకి వెళ్ళాడు.. క్యాషియర్ కు ఓ లెటర్ ఇచ్చాడు.. 'క్యాష్ కౌంటర్ డ్రాయర్ లో ఎంత డబ్బులు ఉంటే అంత ఈ  బ్యాగ్ లో వేసేయ్' అని ఉంది. ఆ తర్వాత క్యాషియర్ ఎవరికో సిగ్నల్ ఇవ్వాలని ప్రయత్నించగా.. 'డబ్బులు వెంటనే బ్యాగులోకి వేసేయ్.. లేదంటే ఈ హ్యాండ్ గ్రెనేడ్ విసిరేస్తా' అని అన్నాడు. అలాగే నలుపు రంగులో ఉన్న ఓ వస్తువును చూపించడంతో నిజంగానే గ్రెనేడ్ అనుకున్న ఆ క్యాషియర్ డబ్బులను బ్యాగులో పెట్టేశాడు. అయిదు రోజుల తర్వాత మరో బ్యాంకులో కూడా ఇదే విధంగా దొంగతనానికి పాల్పడ్డాడు. అలా దాదాపు 6 లక్షల రూపాయల సొత్తును దొంగిలించాడు ఆ వ్యక్తి.   

Image result for Israeli man uses avocado

దీంతో పోలీసులు అతడి మీద నిఘా ఉంచారు. సీసీటీవీ ఫుటేజీ వీడియోలను గమనించి అతడిని ట్రేస్ చేశారు. తీరా చూస్తే అతడు అవకాడో పండుకు నలుపు రంగు పూసి హ్యాండ్ గ్రెనేడ్ గా బిల్డప్ ఇచ్చాడట. దీంతో బెదిరిపోయిన క్యాషియర్లు డబ్బులు ఇచ్చేసారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. గతంలో మూడేళ్ళ జైలు శిక్షను కూడా అతడు అనుభవించాడట..!  

Image result for Israeli man uses avocado