Tuesday, May 21, 2019
Follow Us on :

మరో ప్రయోగానికి సిద్ధమ‌వుతున్న‌ ఇస్రో

By BhaaratToday | Published On May 13th, 2019

నెల్లూరు జిల్లాలో మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఈ నెల 22న ఉదయం 5.57 గంటలకు షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ-46 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. రాకెట్ ద్వారా రీశాట్-2బీ అనే అత్యంత శక్తివంతమైన ఉపగ్రహం నింగిలోకి వెళ్లనుంది. రీశాట్ సిరీస్ లో ఇది నాలుగో ఉపగ్రహం. రీశాట్ -2బీ భూమి మీద జరిగే మార్పులు, ప్రకృతి విపత్తులపై నాణ్యమైన చిత్రాల్ని తీయనుంది. సైనిక అవసరాలకు కూడా ఎక్కువగా ఉపయోగపడనుంది.