Tuesday, September 24, 2019
Follow Us on :

ఎట్టిప‌రిస్థితుల్లో వ‌దిలి పెట్టేది లేదు: జబర్దస్త్ షోపై స్పందించిన నాగ‌బాబు

By BhaaratToday | Published On Apr 15th, 2019

'జబర్దస్త్' కామెడీ షో  అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియ‌నివారుండ‌రు. ఈటీవీలో అత్యధిక రేటింగుతో ఈ షో కొన్నేళ్లుగా దూసుకుపోతోంది.  ఈ కామెడీషోకి న్యాయనిర్ణేతలుగా నాగబాబు - రోజా వ్యవహరిస్తున్నారు. ఈ షో నాన్ స్టాప్ గా నవ్వులు పూయించడంలో ఈ ఇద్దరి పాత్ర ఎంతో ఉంద‌నే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే నాగబాబు .. 'జనసేన' పార్టీలో చేరడం .. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగిపోయాయి. దీంతో ఇక రాజకీయాలపైనే నాగబాబు దృష్టిపెట్టనున్నారనీ, ఆయన జబర్దస్త్' చేయకపోవచ్చుననే ప్రచారం జ‌రుగుతుండ‌టంతో నాగ‌బాబు స్పందించారు. 'జబర్దస్త్' అంటే నాకు చాలా ఇష్టం .. ఎన్నో సమస్యల నుంచి బయటపడటానికి అది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నెలకి నాలుగు రోజులు మాత్రమే షూటింగు ఉంటుంది. ఆ నాలుగు రోజులు ఎలాగో అలా నేను సర్దుబాటు చేసుకుంటాను. ఒకవేళ ఎంపీగా గెలిచినా ఈ షో చేయడం మానుకోను .. న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూనే ఉంటాను. రాజకీయ రంగంలో ఒకవైపున పదవులు నిర్వహిస్తూనే .. మరో వైపున టీవీ షోలకి న్యాయనిర్ణేతలుగా పనిచేసిన వాళ్లు చాలామందే ఉన్నారు" అని చెప్పుకొచ్చారు.