Thursday, April 25, 2019
Follow Us on :

నామినేష‌న్ కు సిద్ధ‌మైన జ‌గ‌న్.. జ‌న‌సేనాని

By BhaaratToday | Published On Mar 21st, 2019

వైసీపీ అధ్యక్షుడు జగన్ శుక్రవారం ఉదయం పులివెందులలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అనంత‌రం పులివెందులలోనే ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొననున్నారు. నేడు మేనిఫెస్టో కమిటీ సభ్యులతో జగన్‌ ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ సమావేశం నేపథ్యంలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనరని పార్టీ వ‌ర్గాల స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా.. గాజువాక నుంచి పోటీ చేయనున్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ గురువారం తన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఉదయం పదింటికి విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న పవన్‌ గాజువాక జీవీఎంలో నామినేషన్‌ వేస్తారు. అనంతరం పాత గాజువాక, ఆనందపురం పూల మార్కెట్‌, పాత జైలు రోడ్డు వద్ద నిర్వహించే బ‌హిరంగ సభల‌లో జ‌న‌సేనాని పాల్గొంటారు.