Friday, March 22, 2019
Follow Us on :

వైసీపీ అభిమానులు రెచ్చిపోయి ఎటువంటి పనులూ చేయకండి: జగన్

By BhaaratToday | Published On Mar 15th, 2019

ప్రస్తుతం వైఎస్ వివేకానంద హత్య గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. వైసీపీ నాయకుడు హత్య తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి తెర లేపింది. ఈ ఘటనపై జగన్ స్పందించారు. తన చిన్నాన్న హత్యపై అనుమానాలున్నాయని చెప్పిన జగన్.. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఎటువంటి చర్యలు తీసుకోకండి అని సూచించారు.  దేవుడిపై తనకు నమ్మకం ఉంది, అన్యాయం చేసినవాళ్లను ఆయన తప్పక శిక్షిస్తాడు. ఈ ఘటనకు నిరసనగా ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అని జగన్ వైసీపీ కార్యకర్తలకు సూచించారు. 

చిన్నాన్నను చంపి ఆయనే ప్రమాదవశాత్తు చనిపోయినట్టు నమ్మించాలని ప్రయత్నాలు జరిగాయని జగన్ ఆరోపించారు. రక్తం కక్కుకుని పడిపోయినట్టు నమ్మించాలని, బాత్రూంలో కమోడ్ గుద్దుకుని ప్రాణాలు వదిలినట్టు చిత్రీకరించాలని ప్రయత్నించారని..  అంతేకాదు, ఆయన హత్యా నేరాన్ని మరొకరిపై నెట్టేందుకు, ఈ విషయంలో పూర్తి అయోమయాన్ని సృష్టించేందుకు ప్రణాళిక ప్రకారం వ్యవహరించారన్నారు. మా చిన్నాన్న రక్తంతో లేఖ రాసినట్టు సంఘటన స్థలంలో ఓ లేఖను పుట్టించారని.. ఆ లేఖలో డ్రైవర్ పేరు పెట్టి అతడే తన మరణానికి కారణమని అనుమానాలు వచ్చేలా కుట్ర పన్నారని జగన్ చెప్పుకొచ్చారు.