Monday, September 23, 2019
Follow Us on :

ఢిల్లీ పర్యటన ముగియగానే ఏరియల్ సర్వే.. ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు అదనపు సాయం

By BhaaratToday | Published On Aug 8th, 2019

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగియగానే  పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. గన్నవరం చేరుకున్న జగన్ నేరుగా హెలికాఫ్టర్ లో ఏరియల్ సర్వేకు బయలుదేరి వెళ్లారు. జగన్ తో పాటు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అనిల్ కుమార్ యాదవ్ వెళ్లారు. వరద ముంపుపై రాజమండ్రిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.5000 అదనపు సాయం అందించాలంటూ అధికారులను ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో ఉంటున్న వారికి భోజనాలు, ముంపు బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీకి ఇది అదనమని తెలిపారు.

Image

ముంపునకు గురైన గ్రామాలకే కాకుండా, వరదల కారణంగా సంబంధాలు తెగిపోయి ఇబ్బందులు పడుతున్న గ్రామాలకూ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిహారం కాకుండా ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని.. పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో సాగుచేసిన పంటలు వరదల కారణంగా దెబ్బతింటే.. అక్కడ వారికి పరిహారంతో పాటు ఉచితంగా సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలని అన్నారు. అన్ని విధాలా సహాయ చర్యలు కొనసాగించాలని అన్నారు. 

Image

ఏపీలో కురుస్తున్న వర్షాలకు పోలవరం మండలంలోని గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 
Image