Friday, March 22, 2019
Follow Us on :

వివేకాకు ఎక్కడెక్కడ గాయాలయ్యాయో జగన్ కు చెప్పిన పెద్దాయన

By BhaaratToday | Published On Mar 15th, 2019

 వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి  వైఎస్‌ వివేకానందరెడ్డి మృతదేహాన్ని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. తన చిన్నాన్న పార్థివ దేహానికి జగన్ నివాళులు అర్పించారు. శుక్రవారం సాయంత్రం పులివెందులలోని వైఎస్‌ వివేకానందరెడ్డి స్వగృహానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌ ముందుగా నివాళి అర్పించి, అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఉన్నారు. అయితే అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు జగన్ కు కొన్ని ఫోటోలు చూపించారు. అలాగే ఎక్కడెక్కడ గాయాలు అయ్యాయో ఓ పెద్దాయన జగన్ కు చెప్పారు.