Thursday, December 12, 2019
Follow Us on :

తీవ్ర నిరాశకు లోనైన కివీస్ క్రికెటర్.. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోకండంటూ..!

By BhaaratToday | Published On Jul 15th, 2019

ఆటలను అమితంగా ప్రేమించే వాళ్లకు తమ జట్టు ఓడిపోయిందంటే ఎంత బాధపడిపోతామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆటగాళ్ల బాధ వర్ణించలేము. ప్రస్తుతం న్యూజిలాండ్ ఆటగాళ్ల మానసిక పరిస్థితి అలాగే ఉంది. అందరూ కేన్ విలియమ్సన్ లాగా నవ్వుతూ ఉండలేరు కదా.. జేమ్స్ నీషమ్ లాంటి ఆటగాళ్లు కూడా ఉంటారు. ట్విట్టర్ ఖాతాలో తన బాధనంతా చెప్పుకొచ్చాడు   

Image result for james neesham

తీవ్ర నిరాశకు లోనైన నీషామ్.. ఆటలను కెరీర్‌గా ఎంచుకోవద్దంటూ సూచిస్తూ ట్వీట్ చేశాడు. వంటలో మరొకటే కెరీర్‌గా తీసుకోండి.. బాగా 60 ఏళ్లకే హ్యాపీగా చనిపోండని సూచించాడు. కప్ గెలవలేకపోవడం పట్ల న్యూజిలాండ్ మద్దతుదారులకు క్షమాపణలు చెప్పాడు. 

ఫైనల్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కూడా 50 ఓవర్లలో 241 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్లో ఫస్ట్ ఇంగ్లండ్‌ బ్యాటింగ్ చేసింది. ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. కూడా ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. బౌండరీలు ఎక్కువగా కొట్టారన్న కారణంతో ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించారు.