Sunday, December 15, 2019
Follow Us on :

భారత్ ఫ్యాన్స్ దగ్గర కొన్ని వేల టికెట్స్.. కివీస్ క్రికెటర్లు ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారంటే

By BhaaratToday | Published On Jul 13th, 2019

వరల్డ్ కప్ మొదలైనప్పటి నుండీ భారత జట్టే హాట్ ఫేవరెట్ గా నిలిచింది. గ్రూప్ స్టేజ్ లో కూడా భారత్ నంబర్ వన్ గా నిలిచింది. సెమీస్ లో కూడా భారత్ విజయం దాదాపు ఖాయమనుకున్నారు.. కానీ కివీస్ షాక్ ఇచ్చింది. భారత్ ఫైనల్ చేరుతుందని భావించిన క్రికెట్ అభిమానులు.. కొన్ని వేల టికెట్స్ ను ముందుగానే కొని తమ దగ్గర పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు భారత్ ఫైనల్ లో లేకపోవడంతో చాలా మంది ఫైనల్ కు వెళ్లాలనుకోవడం లేదు. కొందరు ఆన్ లైన్ లో డబుల్ రేటుకు రీసేల్ పెట్టారు.. మరికొందరేమో తమ వద్దనే ఉంచుకున్నారు. ఇప్పుడు కివీస్ అభిమానులు వెళ్లాలని అనుకున్నా కూడా టికెట్స్ దొరకడం లేదు.. దీంతో న్యూజిలాండ్ క్రికెటర్ జేమ్స్ నీషమ్ భారత్ అభిమానుల కోసం ఒక ట్వీట్ పెట్టాడు. 


ప్రియమైన భారత్ క్రికెట్ అభిమానుల్లారా.. ఒకవేళ మీరు ఫైనల్ మ్యాచ్ కు రాకూడదు అని అనుకుంటే.. దయచేసి అఫీషియల్ సైట్ ద్వారా తిరిగి వెనక్కు అమ్మేయండి.. ఎందుకంటే మిగతా వాటిలో అమ్మడం ద్వారా అధిక లాభం అయితే వస్తుంది కానీ.. నిజమైన క్రికెట్ అభిమానులు అంత డబ్బు పెట్టి  చూడలేకపోవచ్చు.. అని ట్వీట్ చేశాడు. కొందరు భారీ ధరకు టికెట్స్ ను బ్లాక్ లో అమ్ముతూ ఉండడం.. నిజమైన క్రికెట్ అభిమానులు అంత ధర పెట్టలేకుండా ఉండడంతో నీషమ్ భారత్ అభిమానులకు ఈ విజ్ఞప్తి చేస్తున్నాడు. వీలైతే వచ్చి సపోర్ట్ చేయండి అని కివీస్ ఆటగాళ్లు భారత్ అభిమానులను కోరారు కూడానూ..! ఫైనల్ లో చాలా వరకూ భారత్ అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది.