Tuesday, October 15, 2019
Follow Us on :

రాహుల్ కాశ్మీర్ కు వచ్చి.. పర్యటించి.. నిజాలేమిటో తెలుసుకో..!

By BhaaratToday | Published On Aug 13th, 2019

ప్రస్తుతం కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. బక్రీద్ ను కూడా అక్కడి ప్రజలు ఎంతో ప్రశాంతంగా జరుపుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేత  రాహుల్ గాంధీ మాత్రం కశ్మీర్‌లో‌లో చెలరేగుతుందని అక్కడ అసాధారణ పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు కోపం తెప్పించింది. రాహుల్ గాంధీ లాంటీ వ్యక్తి ఇలా మాట్లాడి ఉండకూడదని అన్నారు. 


సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ రాహుల్ కోసం ప్రత్యేకంగా ఓ విమానం పంపుతానని, వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి చూసుకోవచ్చని అన్నారు. రాహుల్‌ను బాధ్యత కలిగిన నాయకుడిగా అభివర్ణించిన సత్యపాల్ మాలిక్.. ఆయన ఇలాంటి బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాహుల్‌ను కశ్మీర్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాననీ.. ఆయన కోసం నేనో విమానాన్ని పంపిస్తా.. ఇక్కడ పర్యటించి ఆ తర్వాత మాట్లాడాలని అన్నారు సత్యపాల్ మాలిక్. మీరో బాధ్యతాయుతమైన నేత అయి ఉండీ ఇలా బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలు చేయడం సరికాదని మాలిక్ అన్నారు.