Wednesday, October 16, 2019
Follow Us on :

జమ్మూ కాశ్మీర్ లో మొదలైన హింసాకాండ.. ఇద్దరిని కాల్చి చంపిన తీవ్రవాదులు

By BhaaratToday | Published On Aug 27th, 2019

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేశాక సైన్యం పహారా కాస్తోంది. వివాదాస్పదమైన ప్రాంతాల్లో పోలీసులు, సైన్యం అలర్ట్ గా ఉన్నారు. అయితే తీవ్రవాదులు మాత్రం ఇద్దరు యువకులను పొట్టనపెట్టుకున్నారు. కిడ్నాప్ చేసి మరీ ఆ యువకులను హతమార్చారు. 


సోమవారం రాత్రి 7.30 గంటలకు పుల్వామా జిల్లా థోక్ ప్రాంతంలోని తాత్కాలిక శిబిరం నుంచి అబ్దుల్ ఖదీర్ (రాజౌరీ జిల్లా వాసి), మన్సూర్ అహ్మద్ (శ్రీనగర్ వాసి)లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆ విషయం తెలియగానే వారి కోసం భద్రతాబలగాలు సెర్చ్ ఆపరేషన్ ను చేపట్టాయి. అయితే వారు విగతజీవులుగా కనిపించారు. పుల్వామా జిల్లా అటవీ ప్రాంతంలో వీరి శవాలు కనిపించాయి. వారి శరీరాలు బుల్లెట్లతో ఛిద్రమయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో జరిగిన తొలి ఉగ్రవాద హింసాకాండ ఇదే.