Saturday, December 14, 2019
Follow Us on :

పోలీసులకు లొంగిపోనున్న జనసేన ఎమ్మెల్యే

By BhaaratToday | Published On Aug 13th, 2019

రాపాక వరప్రసాద్.. జనసేన తరపున గెలిచిన ఏకైక అభ్యర్థి. మలికిపురం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.  పేకాట ఆడుతున్న రాపాక అనుచరుడిని పోలీసులు అరెస్టు చేయడంతో మలికిపురం ఎస్సై కేవీ రామారావుకు ఎమ్మెల్యే రాపాకకు మధ్య వివాదం మొదలైనాట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు మద్దతుగా జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. స్టేషన్ కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

ఈ దాడి కేసులో ఏ-1గా రాపాక వరప్రసాద్ పేరునే చేర్చడంతో అరెస్టుకు రంగం సిద్ధమైంది. దీంతో రాపాక వరప్రసాద్ మలికిపురం పోలీసుల ముందు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. పేకాడుతూ పట్టుబడిన వారికి మద్దతు ఇచ్చారని.. 100 మంది అనుచరులతో వచ్చి, పోలీసులపై దౌర్జన్యం చేసి, ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచారనే అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. 

పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడిన రాపాక వరప్రసాద్, అతడి అనుచరులపై క్రైం నంబర్‌ 183/2019 కింద సెక్షన్లు 143, 147, 148, 341, 427, 149, అండ సెక్షన్‌ 3 కింద పీడీపీపీ యాక్ట్‌ అండ్‌ క్రిమినల్‌ ఎమైండ్‌మెంట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ నయీం అస్మీ వివరించారు.