Saturday, December 14, 2019
Follow Us on :

ఎన్నికల్లో ఓడినందుకు గర్వపడుతున్నా: పవన్

By BhaaratToday | Published On Aug 5th, 2019

ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ  ఎన్నికల్లో తాను ఓటమిపాలు కావడం తాను గర్వపడుతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయసమావేశంలో ఆయన పాల్గోని మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి తనకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. 2014లో మద్దతు ఇచ్చినందుకే తనకు పదవులు ఇస్తానని అన్నారని, ఎటువంటి పదవులు ఆశించి తాను రాజకీయాల్లోకి రాలేదని, నిస్వార్థంగా పని చేసే వ్యక్తులు ఇంకా ఉన్నారని చెప్పేందుకే ఎన్నికల్లో తాను పోటీ చేశానని చెప్పారు. ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం శ్రమిస్తామని చెప్పారు.

అయితే జనసేన పార్టీని ఏ పార్టీలో విలీనం చేయనని స్పష్టం చేశారు. ప్రజలు తమ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటామని అన్నారు. తన ప్రాణం పోయిన సరే, పార్టీని విలీనం చేయడం జరగదని స్పష్టం చేశారు. రౌడీ యిజాన్ని, దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు.