Saturday, October 19, 2019
Follow Us on :

మియాందాద్ గంగూలీని అనే అంత వాడివి కావు.. తప్పు మీవైపే

By BhaaratToday | Published On Feb 23rd, 2019

ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా క్షీణిస్తున్నాయి. క్రికెట్ కూడా ఆడకూడదంటూ చాలా మంది వాదిస్తున్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా క్రికెట్ ఆడటం అనవసరం అని చెప్పుకొచ్చారు. క్రికెట్ మాత్రమే కాదు.. ఎటువంటి ఆటలు పాకిస్థాన్ తో ఆడకూడదని గంగూలీ తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మాత్రం భారత్ ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. 

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జావేద్ ఖాన్ వెటకారంగా స్పందించాడు. దీంతో దాదా అభిమానులు సోషల్ మీడియాలో మియాందాద్ ను ఆడుకుంటూ ఉన్నారు. ఈ విషయంపై మియాందాద్ మాట్లాడుతూ ‘సౌరవ్ గంగూలీ రాబోవు ఎన్నికల్లో పోటీచేయాలని ఆశపడుతున్నాడేమో..? అతను ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది.. ఆయన ప్రచారం కోసం ‘మ్యాచ్ బహిష్కరణ’ వ్యాఖ్యలు చేసి అందర్నీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు' అని కామెంట్లు చేయడంతో భారత్ అభిమానులకు చిర్రెత్తుకొస్తోంది.  పుల్వామా దాడి తర్వాత భారత్ వ్యవహరిస్తున్న తీరుపై తమకేమీ బాధలేదని.. పాకిస్థాన్ ఎప్పుడూ భారత్‌‌తో శాంతిపూర్వక సంబంధాల కోసం ప్రయత్నిస్తోందని మియాందాద్ వ్యాఖ్యానించాడు. అయితే మియాందాద్ చేసిన వ్యాఖ్యలకు భారతీయులు సరైన రీతిలో స్పందిస్తున్నారు. మొదట మీ దేశం కరెక్టుగా ఉంటే అన్నీ బాగుండేవని.. కానీ తీవ్రవాదులను ఉసిగొల్పుతుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. అయినా సౌరవ్ గంగూలీకి వార్తల్లో నిలవాల్సిన అవసరం అసలు లేదని.. ఇలాంటి చిల్లర పనులు పాకిస్థాన్ వాళ్ళే చేస్తారని కౌంటర్ ఇచ్చారు. ఇక దాదా మియాందాద్ కు ఏమని సమాధానం చెబుతాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు.