Monday, November 18, 2019
Follow Us on :

జ‌య‌రాం హ‌త్య కేసులో పోలీసు అధికారిపై వేటు

By BhaaratToday | Published On Feb 17th, 2019

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు అటూఇటు తిరిగి చివరికి పోలీసుల మెడకే చుట్టుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డికి సాయం అందించిన పలువురు పోలీసులపై ఉన్నతాధికారులు ఇప్పటికే వేటు వేశారు. తాజాగా, మరో పోలీసు అధికారిపైనా వేటు పడింది. తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన ఈ హత్యకేసు ఇప్పటికే పలు మలుపులు తిరిగింది. దర్యాప్తులో రోజుకో కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. తాజాగా, ఈ కేసులో రాయదుర్గం సీఐ రాంబాబు పాత్ర కూడా ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. జయరాం హత్య తర్వాత రాంబాబుతో రాకేశ్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై వేటేసిన అధికారులు హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.