Wednesday, October 16, 2019
Follow Us on :

జయరాం మృతిపై మరోసారి విచారణ..! 8 సెక్షన్ల కింద కేసు నమోదు..!!

By BhaaratToday | Published On Feb 8th, 2019

ప్రవాసాంధ్రుడు, కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్‌ చిగురుపాటి జయరాం హత్య ఘటనలో మరోసారి కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 8 సెక్షన్ల కింద కేసును నమోదు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు. జయరాం భార్య పద్మశ్రీ పలు సందేహాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు జయరాం హత్య కేసు వివరాలను గురువారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు పంపించారు. జయరాం మృతదేహం లభించినప్పటి నుంచి హంతకుడు రాకేష్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేంతవరకు జరిగిన పరిణామాలను, కేస్‌ డైరీగా రూపొందించిన పత్రాలు, సీడీలను కమిషనర్‌ వి.అంజనీకుమార్‌కు అందజేశారు. కేసు విచారణ బాధ్యతను బంజారాహిల్స్‌ ఏసీపీకి అప్పగిస్తూ హైదరాబాద్‌ సిటీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు.. దర్యాప్తు చేపట్టనున్నారు.