
టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. ఏ విషయమైనా నిక్కచ్చిగా మాట్లాడుతారు. దేన్నీ దాచుకోరు కూడానూ..! గతంలో ఎన్నో సందర్భాల్లో ఆయన తన మాటలతో సంచలనం సృష్టించారు. తాజాగా జగన్ 100 రోజుల పాలనపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మావాడే.. అంతేకాదు మావాడు చాలా తెలివైనవాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి అంశాన్ని మైక్రోస్కోపులో చూసి లోపాలను సరిదిద్దాలి.. అంతేగాని నేలకేసి కొట్టొద్దన్నారు. రాజధాని ఇక్కడే ఉంటుంది.. ఎక్కడికీ తరలిపోదనే అభిప్రాయాన్ని జేసీ వ్యక్తం చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుంది, మా వాడు అంత తెలివి తక్కువ వాడు కాదని.. జగన్ పాలనకు వందకు వంద పడాల్సిందేనని అన్నారు.
ఏపీ ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగుల విలీనం భారం అవుతుందని, ఏ సర్కార్ కూడా వ్యాపారం చేయకూడదని సూచించారు. సీఎం జగన్ కనుక తనను అడిగితే సలహాలు ఇస్తానని అన్నారు. ఉద్యోగులను విలీనం చేయడం వ్యాపారమేనని అన్నారు.