Tuesday, September 24, 2019
Follow Us on :

‘జెర్సీ’ ట్రైలర్ విడుదల

By BhaaratToday | Published On Apr 12th, 2019

నేచురల్‌ స్టార్‌ నాని, శ్రద్ధా శ్రీనాథ్ లు నటిస్తున్న చిత్రం ‘జెర్సీ’. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో నాని అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు. క్రికెటర్‌గా అర్జున్‌ మైదానంలోకి అడుగుపెట్టడం, సహచర ఆటగాళ్లతో గొడవపెట్టుకోవడం, శ్రద్ధతో ప్రేమలో పడటం తదితర సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది. పదేళ్ల తర్వాత అర్జున్‌ (నాని) క్రికెట్‌కు దూరమై అటు ఉద్యోగం లేక ఇటు కుటుంబాన్ని నెట్టుకురాలేక సతమతమవడాన్ని చూపించారు. ‘పదేళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్లీ మొదలుపెడతా..’ అంటూ నాని ఉద్వేగంతో చెబుతున్న డైలాగ్‌ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమా ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.