Saturday, October 19, 2019
Follow Us on :

ఊహించిందే జరుగుతోంది..  హఫీజ్ సయీద్ కుట్ర పన్నుతున్నాడు

By BhaaratToday | Published On Aug 12th, 2019

కాశ్మీర్ లో శాంతిని స్థాపించాలని భారత్ ఆకాంక్షిస్తుంటే పాకిస్థాన్ ముంబై ఉగ్రదాడుల సూత్రధారి లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా ఉగ్రసంస్థ అధినేత హఫీజ్ సయీద్ ను జైలు నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే.  ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు ముందు హఫీజ్ సయీద్ ను గత నెల 17న అరెస్ట్ చేయగా.. కరెక్ట్ గా ఆర్టికల్ 370 రద్దుకు ప్రతీకారంగా సయీద్ ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్టికల్ 370 రద్దుకు ప్రతీకారంగా సయీద్ భారత్ లో తీవ్ర విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నట్లు రక్షణ, భద్రతారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అనుకున్నట్లుగానే హఫీజ్ సయీద్ కొన్ని తీవ్రవాద సంస్థలతో చేతులు కలిపాడు. కొన్ని తీవ్రవాద సంస్థలతో కలిసి ఈ రాక్షసుడు భారత్ లో విధ్వంసానికి పాల్పడబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ గ్రూప్ లకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని చేయడానికి హఫీజ్ సయీద్ ముందుకు వచ్చాడట. వెనకాల ఉండే ఈ మొత్తం తతంగాన్ని నడిపించాలని హఫీజ్ తన అనుచరులకు తెలిపాడు. 

2008 లో ముంబైలో జరిగిన పేలుళ్లకు హఫీజ్ మాస్టర్ మైండ్.. 160 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాడు. అతడిని భారత్ కు అప్పగించాలని డిమాండ్లు వస్తున్నా.. పాక్ మాత్రం అతడి కొమ్ముకాస్తోంది.