Tuesday, June 18, 2019
Follow Us on :

నేనేమీ చెప్పాల‌నుకోవ‌ట్లేదు.. నిజం చేదుగానే ఉంటుంది

By BhaaratToday | Published On May 21st, 2019

*వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో స్థానం ద‌క్క‌క‌పోవ‌డంపై వినూత్న నిర‌స‌న‌

పాక్ జట్టు ఎంపికలో ప్రతిసారి విమర్శలు వినిపించడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు వరల్డ్ కప్ వేళ కూడా అదే సీన్ రిఫీట‌య్యింది. మంచి నైపుణ్యం ఉన్న‌ ఫాస్ట్ బౌలర్ గా గుర్తింపు ఉన్న జునైద్ ఖాన్ కు ఆశ్చర్యకరమైన రీతిలో వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కలేదు. దాదాపు క‌నుమరుగైన స్థితిలో ఉన్న కొందరు ఆటగాళ్లు అనూహ్యంగా పాక్ జట్టులో చోటు దక్కించుకోగా.. సెలక్టర్లు జునైద్ కు మొండిచేయి చూపారు.

Junaid Khan

ఈ నేపథ్యంలో జునైద్ నోటికి నల్ల ప్లాస్టర్ అంటించుకుని తన నిరసన వ్యక్తం చేశాడు. "ఈ వ్యవహారంపై నేనేమీ చెప్పాలనుకోవడంలేదు. నిజం చేదుగానే ఉంటుంది" అంటూ ట్వీట్ చేశాడు. సెల‌క్ష‌న్ క‌మిటీపై త‌న నిర‌స‌న‌ను వెళ్ల‌గ‌క్కుతూ జునైద్ పెట్టిన ఈ పోస్టుకు అభిమానుల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది.