Thursday, September 19, 2019
Follow Us on :

అసదుద్దీన్‌ వ్యాఖ్యలపై చర్యలు తప్పవని తేల్చి చెప్పిన లక్ష్మణ్

By BhaaratToday | Published On Aug 17th, 2019

ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు చర్యలు తప్పవని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తేల్చి చెప్పారు. అలాగే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా చేసి తీరతామని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో బీజేపీనే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం అని అన్నారు లక్ష్మణ్. హిందుగాళ్లు, బొందుగాళ్లు అన్న కేసీఆర్‌కు కరీంనగర్ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. మోడీ బొమ్మ పెట్టాల్సి వస్తోందని ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం లేదు. 

తెలంగాణ విమోచన దినోత్సవం అయిన సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ దినం.. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాన్ని తొక్కి పెడుతున్నారని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం పాలైందన్నారు. ప్రాజెక్టుల్లో కమిషన్ల రూపంలో వచ్చిన అవినీతి డబ్బును ఎన్నికల్లో ఉపయోగించారన్నారు. పేదల సంక్షేమ పథకాలన్నింటిలోనూ అవినీతి జరిగిందని లక్ష్మణ్‌ ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల గురించి పట్టించుకోని ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ భవనాల కోసం మాత్రం ఎకరం రూ. 100కే అప్పనంగా అప్పగించారన్నారు లక్ష్మణ్.