Friday, July 19, 2019
Follow Us on :

పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన కే.ఏ.పాల్..!

By BhaaratToday | Published On Apr 1st, 2019

కే.ఏ.పాల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. వీలైనన్ని చోట్ల మీటింగులు పెడుతూ తమ ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. ఈ సమయంలో పాల్ తన ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముక్కు పిండే శక్తి తనకే ఉందని అన్నారు. తనను చూస్తే కేసీఆర్ భయంతో పారిపోతారని, కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా తనకు మాత్రమే ఉందని కేఏ పాల్ అన్నారు.

 అయితే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు కే.ఏ.పాల్. పవన్ కళ్యాణ్ ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం, అన్నీ ఇస్తామని అంటున్నారని.. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడ నుండి తీసుకొని వస్తారని పాల్ ప్రశ్నించారు. ఎవరినైనా ధనవంతురాలిని మరోసారి పెళ్లి చేసుకుని ఆ వచ్చే కట్నం డబ్బులు తెచ్చి ఇస్తారా? అని చేయడం వివాదం అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ పై పాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక వైసీపీ అధినేత జగన్ కు ఓటు వేస్తే, అది మోదీ, కేసీఆర్ ఖాతాలోకి వెళుతుందని అన్నారు.