Friday, December 06, 2019
Follow Us on :

ఫ్లాష్ న్యూస్.. 100 సీట్లు గెలుస్తామన్న పాల్ కు ఎన్ని ఓట్లు పడ్డాయంటే

By BhaaratToday | Published On May 23rd, 2019

కేఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఎన్నికల ప్రచారంలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆయన ఆంధ్రప్రదేశ్ లోని 175 స్థానాలకు గానూ ఏకంగా 100 సీట్లు మావే అని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా 30 సీట్లు గెలుస్తామని.. కింగ్ మేకర్లము అవుతామని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు. ఇక రిజల్ట్ డే వచ్చేసింది. ఎక్కడ కూడా ప్రజాశాంతి పార్టీనే కనపడలేదు..! ఇక కేఏ పాల్ కు వచ్చిన ఓట్లు చూసి అందరూ షాక్ అవుతున్నారు. మొదట 52 ఓట్లు పడ్డాయని వార్తలు రాగా.. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఆయన 100 ఓట్ల మార్కును దాటారు. ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ ప్రకారం కేఏ పాల్‌కు మధ్యాహ్నం 11. 48 గంటలవరకు ఉన్న సమాచారం మేరకు కేవలం 407 ఓట్లు పడ్డాయి.  

 ప్రజాశాంతి పార్టీ పేరుతో ఏపీలో చాలాచోట్ల అభ్యర్థులను నిలిపి.. ప్రచారంలోనూ హడావిడి చేసిన  కేఏ పాల్‌ చివరకు తాను పోటీ చేసిన నరసాపురం లోక్‌సభ స్థానంలో డిపాజిట్‌ కూడా దక్కించుకోకుండా పరువు పోగొట్టుకునే పరిస్థితి నెలకొంది. నరసాపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.