Monday, December 09, 2019
Follow Us on :

'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సీక్వెల్ బాంబు పేల్చిన వర్మ..!

By BhaaratToday | Published On Nov 16th, 2019

ఎప్పుడు ఏ వివాదంతో ముందుకు వస్తాడో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకే తెలియాలి. ఎందుకంటే గతంలో ఆయన తీసుకొచ్చిన వివాదాస్పద సినిమాలు అలాంటివి. ఇప్పుడు మరోసారి 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' అనే వివాదాస్పద సబ్జెక్టు తో ముందుకు వస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన పాటలు, ఫోటోలు వరుసగా  విడుదల చేసి ఎన్నో వివాదాలకు తెర తీశాడు వర్మ. ఇప్పటికే ఓ వర్గం ఈ సినిమాపై గుర్రుగా ఉంది. ఆన్ లైన్ లో డిబేట్లు.. ఎంతకావాలంటే అంత పబ్లిసిటీ ఈ సినిమాకు తెచ్చిపెట్టాయి. ఎప్పుడు విడుదల అవుతుందా.. ఇంకా ఎన్ని వివాదాస్పద అంశాలు సినిమాలో ఉంటాయో అని మరికొందరు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమాకు సీక్వెల్ ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. 

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన వచ్చిందని చెప్పాడు. ఈ సీక్వెల్ కు 'రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్' అనే టైటిల్ పెడతానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.  వల్లభనేని వంశీ టీడీపీని విమర్శిస్తున్న ఇంటర్వ్యూలు చూసిన తర్వాత తనకు ఈ ఐడియా వచ్చిందని తెలిపాడు.