Thursday, September 19, 2019
Follow Us on :

కమ్మరాజ్యంలో కడప రెడ్లు.. అందులో జగన్, చంద్రబాబు

By BhaaratToday | Published On Aug 9th, 2019

ఎప్పుడు ఏ వివాదంతో ముందుకు వస్తాడో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకే తెలియాలి. ఎందుకంటే గతంలో ఆయన తీసుకొచ్చిన వివాదాస్పద సినిమాలు అలాంటివి. ఇప్పుడు మరోసారి 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' అనే వివాదాస్పద సబ్జెక్టు తో ముందుకు వస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన పాటను విడుదల చేసి వివాదానికి తెర తీశాడు వర్మ.  

ఆ పాటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును చూపించారు. సాంగ్ ప్రారంభంలోనే వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం, ఆపై అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని, చంద్రబాబు, జగన్ ల మధ్య వాగ్యుద్ధాన్ని చూపిస్తూ పాట మొదలైంది. చంద్రబాబు, జగన్ ల ఘాటు వ్యాఖ్యలను కూడా ఈ పాటలో చూపించాడు. గతంలో ఎన్నో సినిమాలతో వివాదాలకు తెర తీసిన ఆర్జీవీ.. ఇప్పుడు ఈ పాటతో సంచలనానికి తెరతీశారు. సినిమాతో ఇంకెంత వివాదం సృష్టిస్తాడో.