Thursday, December 12, 2019
Follow Us on :

ఆ మ్యాచ్‌లో ఎవరూ ఓడిపోలేదు.. కాక‌పోతే వారు..

By BhaaratToday | Published On Jul 16th, 2019

ప్ర‌పంచ‌క‌ప్ ఫైనల్‌ మ్యాచ్‌లో బౌండరీల కారణంగా ప్రపంచకప్‌ను కోల్పోయిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా.. మ్యాచ్‌లో ఎవరూ ఓడిపోలేదని, అంతిమంగా మమ్మల్ని ఏదీ విడదీయలేదని తెలిపాడు. ‘ఇంగ్లాండ్‌ జట్టు కప్పు గెలిచిన విజేత.. అంతే తేడా’ అని పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌పై అద్భుతంగా పోరాడిన న్యూజిలాండ్‌ జట్టుకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మరోవైపు.. ఐసీసీ నియమ నిబంధనల్లో మార్పులు అవసరమని పలువురు మాజీలతో సహా క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. బౌండరీల పద్ధతిలో విజేతని ప్రకటించిన విషయంపై విలియమ్సన్‌ని మీడియా ప్రశ్నించగా.. ‘ఇలాంటి ప్రశ్నని అడగాల్సి వస్తుందని మీరు కూడా ఊహించి ఉండరనే అనుకుంటున్నా. అలాగే నేను కూడా ఈ విషయంపై సమాధానం చెబుతానని ఎప్పుడూ అనుకోలేదు’ అని నవ్వుతూ చెప్పాడు. అయితే రెండు జట్లూ సమానంగా పోరాడినప్పుడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం కష్టమని కివీస్‌ కెప్టెన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.