Tuesday, October 15, 2019
Follow Us on :

క్రిష్ గారూ.. కంగనాను ఒంటరిగా వదిలివేయండి.. అంటూ రిక్వెస్ట్

By BhaaratToday | Published On Jan 29th, 2019

 

మణికర్ణిక దర్శకత్వ వివాదంపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందని..  రిలీజ్ అయిన సినిమాలో 70% తను డైరెక్ట్ చేసిందేనని తెలిపారు.  తను డైరెక్ట్ చేసిన వెర్షన్ కనుక మొత్తం అలానే ఉంచితే ఈ సినిమా ఎంతో మెరుగ్గా ఉండేదని.. తన వెర్షన్ బంగారం అయితే ఇప్పుడు ప్రేక్షకులు చూస్తున్నది వెండి లాంటిదని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

క్రిష్ చేసిన వ్యాఖ్యలపై ఆమె సోదరి రంగోలి చందేల్ స్పందించింది. 'ఈ చిత్రానికి మీరే దర్శకత్వం వహించారని ఒప్పుకుంటున్నా. కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కంగానాదే. ఆమెను ఒంటరిగా వదిలేయండి. ఈ చిత్ర విజయాన్ని ఆమెను ఎంజాయ్ చేయనివ్వండి.' అంటూ ట్వీట్ చేశారు.

ఝాన్సి రాణి పై సినిమాకు ఒప్పుకోవడానికి కారణం కంగనానే అని.. తను ఒక వండర్ఫుల్ ఆర్టిస్ట్ అని తెలిపారు.  కానీ సినిమాలో స్ట్రాంగ్ గా ఉన్న ఇతర పాత్రల ప్రాముఖ్యతను తగ్గించమనడం తనకు నచ్చలేదని అందుకే సినిమానుండి బయటకు వచ్చానని అసలు కారణం చెప్పారు క్రిష్. ఈ సినిమాకు  109 రోజులు పనిచేశానని ఎన్టీఆర్ బయోపిక్ కు ఇందులో సగం రోజులు మాత్రమే పని చేశానని తెలిపారు. ఆగష్టు 15 వ తేదీ 2018 లో విడుదల కావలసిందని.. జూన్ లోనే సినిమా పూర్తి చేశానని తెలిపారు.  డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్.. అంతా పూర్తయిన తర్వాత సినిమా నుండి బయటకు వచ్చానని అన్నారు. కంగనా 4-5 రొజులు మాత్రమే షూట్ చేస్తానని చెప్పిందని.. అది కూడా షూటింగ్ అప్డేట్ తనకు ఇస్తానని కూడా చెప్పిందని కానీ తర్వాత ఎన్నో ఘటనలు జరిగాయని క్రిష్ చెప్పుకొచ్చారు.