Monday, September 23, 2019
Follow Us on :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ

By BhaaratToday | Published On Aug 28th, 2019

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు కన్నా లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధాని ప్రాంత రైతులు తమకు ప్రభుత్వం కౌలు చెల్లించడం లేదంటూ గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్న సమయంలో వారంతా కన్నా లక్ష్మీ నారాయణను కలిశారు. వారి ఆవేదన విన్న కన్నా లక్ష్మీనారాయణ రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం కౌలు చెల్లించాలంటూ  ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాశారు.

ఆయన లేఖపై స్పందిస్తూ రూ. 187.40 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నానని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. రాజధానిపై అమరావతి రైతుల్లో ఏర్పడిన గందరగోళ పరిస్థితులను కూడా తొలగించాలని కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు.