Tuesday, May 21, 2019
Follow Us on :

నారా లోకేష్ పై కన్నా సెటైర్లు..!

By BhaaratToday | Published On Apr 2nd, 2019

రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. యు-టర్న్ బాబుకు పోలవరం ప్రాజెక్టు ఓ ఏటీఎంలా మారిందని అన్నారు. యు-టర్న్ బాబు పరిస్థితి ‘బాహుబలి’ సినిమాలో భల్లాలదేవుడిలా ఉందని మోదీ సెటైర్లు విసిరారు. తాము అధికారంలోకి వచ్చాక తొలి కేబినెట్ భేటీలోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని, ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.7 వేల కోట్లు విడుదల చేశామని స్పష్టం చేశారు. 

అయితే మోదీ ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకు చిత్తూరు పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు నాయుడు వీటిపై స్పందించారు. ఇక మోదీ తనను భల్లాలదేవుడు అనడం పట్ల దీటుగా బదులిచ్చారు. ఆంధ్రప్రజలు బాహుబలి అయితే జగన్ భల్లాలదేవుడు. ఈ విలన్ కు తండ్రి కుట్రలు, కుతంత్రాలు చేసే బిజ్జలదేవుడు నరేంద్ర మోదీ. ఈ భల్లాలదేవుడు, బిజ్జలదేవుడు మనల్ని ఏమీ చేయలేరు. నాదే విజయం. ఈ ఎన్నికల యుద్ధంలో 25కి 25 సీట్లు గెలిచి చూపిస్తాం అంటూ సవాల్ విసిరారు.

ఈ విమర్శలన్నీ కొనసాగుతుండగానే నారా లోకేష్ కూడా ట్విట్టర్ లో కొన్ని ట్వీట్లు చేశారు. జగన్ ను భల్లాలదేవుడిగా, మోదీని బిజ్జల దేవుడిగా చంద్రబాబు పోల్చగా, కాలకేయుడితోనూ, భల్లాలదేవుడితోనూ మోదీని పోల్చుతూ లోకేశ్ ట్వీట్లు చేశారు. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, లోకేశ్ ను టార్గెట్ చేసుకుని ట్విట్టర్ లో సెటైర్లు వేశారు. 

"నువ్వు రాయించిన పైత్యం నీ లాగే ఉంది ''మందలదిరి'' లోకేష్ బాబు. ఒక వేళ నువ్వు అన్నట్లు మీ నాన్న 'బాహుబలి' ఐతే మీ నాన్నని "తెలివి అనే నీ కత్తి"తో పొడిచే "కట్టప్ప"నువ్వే. నీ దెబ్బకి తెలుగుదేశానికి ఏప్రిల్ 11న 'డెంగ్యూ' (నువ్వు పలికిన పదం రాయలేను) వస్తుంది" అని అన్నారు.