Wednesday, October 16, 2019
Follow Us on :

కాశ్మీర్ భారత్ లో ఉండదట..!

By BhaaratToday | Published On Aug 13th, 2019

ఎండీఎంకే నేత వైగో.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట..! ఆయన ఎప్పుడు ఏమి మాట్లాడుతారో అని ఎండీఎంకే లోని ఇతర నాయకులు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భారతదేశంలో కాశ్మీర్ అన్నదే ఉండదట. అది కూడా భారత్ 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా కశ్మీర్ పై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పానని అన్నారు.  

భారతదేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి భారత్ లో కశ్మీర్ ఉండదని వైగో అన్నారు. కశ్మీర్ పై బీజేపీ వాళ్లు బురద చల్లారని మండిపడ్డారు. కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ తప్పిదం కూడా ఉందని అన్నారు. కశ్మీర్ అంశంలో కాంగ్రెస్ ను తాను 30 శాతం తప్పుపడితే... బీజేపీని 70 శాతం తప్పుపడతానని చెప్పారు.