Friday, March 22, 2019
Follow Us on :

కశ్మీర్ సమస్యకు కారకులెవరు.. హింసను ప్రేరేపిస్తోందెవరు..?

By BhaaratToday | Published On Mar 10th, 2019

పాకిస్థాన్‌తో సరిహద్దు సమస్యలు, ఉగ్రవాద సంస్థలతో నిత్యం పొంచివున్న ముప్పు, వేర్పాటువాద సంస్థలు, పార్టీలతో ఎదురయ్యే సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు.. ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రం జమ్ము కశ్మీర్‌. అసలు కశ్మీర్ సమస్యకు కారకులెవరు..? లోయలో హింసను ప్రేరేపిస్తోందెవరు..? ఉగ్రమూకలకు సహకరిస్తోందెవరు..? కశ్మీరీ పండిట్ల అనుభవాలేంటి..? ప్రభుత్వాలను కోరుతోందేంటి..? అన్న ప్రశ్నలు చర్చకు దారి తీస్తున్న నేపథ్యంలో భారత్ టుడే అందిస్తున్న ధర్మపీఠంలో ఈ ప్రశ్నలకు స్వయం కశ్మీరీ పండిట్లే సవివరంగా సమాధానాలు అందిస్తున్నారు.

జమ్ము కశ్మీర్.. రమణీయమైన ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన ఈ రాష్ట్రం.. ఉగ్రదాడులు, తుపాకీ మోతలు, బాంబు పేలుళ్లు, మూకదాడులతో రావణ కాష్టంలా నిత్యం మండుతూనే ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ ఇదే పరిస్థితి. అసలు అందమైన కశ్మీర్ కల్లోల కశ్మీర్ గా మారడానికి కారణం ఏమిటి..? లోయలో హింసను ప్రేరేపిస్తోందెవరు..?

ముస్లింలు మెజారిటీగల కశ్మీర్‌లో హిందువులుగా తమకంటూ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలతో కశ్మీరీ పండిట్లు జీవించేవారు. దేశ విభజన తర్వాత పెచ్చరిల్లిన ఉగ్రవాదం అక్కడి పరిస్థితులను నిత్యం రావణకాష్ఠంలా మార్చివేసింది. 1981లో ఇది తీవ్రరూపం దాల్చడంతో వేల సంఖ్యలో కశ్మీరీ పండిట్ల కుటుంబాలు ఢిల్లీతో సహా ఇతర ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయను విడిచి దేశంలోని ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్న పండిట్లను తిరిగి రప్పించే ప్రయత్నాలు జరిగాయా..? ఈ అంశంలో పార్టీలు తీసుకున్న చర్యలు ఏమిటి..? భిన్న విధానాలు గల పార్టీల మధ్య కశ్మీరీ పండిట్ల దారి ఎటు? వారు మళ్లీ మాతృభూమికి వస్తారా?

ఇక పండిట్లను తిరిగి కశ్మీర్‌కు రప్పిస్తామన్న కేంద్రం.. వారికి ప్రత్యేక టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వివాదాస్పదమైంది. స్థానిక రాజకీయ పార్టీలు, వేర్పాటువాద సంస్థలు కేంద్రంపై మండిపడ్డాయి. కశ్మీరీ పండిట్లకు ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేయడం కొత్త సమస్యలకు బీజం వేయడమేనని వాదించాయి. మరి ఈ నేపథ్యంలో మాతృభూమిలో జీవించే అధికారం కశ్మీరీ పండిట్లకు లేదా..? శరణార్థులుగానే కాలం వెళ్లబుచ్చాలా..? అసలు ఈ పరిస్థితికి కారకులెవరు..?

ఓవైపు పాక్ దుశ్చర్యలు.. ఇంకోవైపు యువతను పెడదారి పట్టిస్తున్న వేర్పాటువాదులు.. మరోవైపు.. ఉగ్రవాదం. అందమైన రాష్ట్రాన్ని కల్లోల రాష్ట్రంగా మారిపోయింది. అసలు కశ్మీర్ సమస్యకు కారకులెవరు..? లోయలో హింసను ప్రేరేపిస్తోందెవరు..? ఉగ్రమూకలకు సహకరిస్తోందెవరు..? కశ్మీరీ పండిట్ల అనుభవాలేంటి..? ప్రభుత్వాలను కోరుతోందేంటి..?