Monday, November 18, 2019
Follow Us on :

‘కేసీఆర్ బయోపిక్’ కు శ్రీకారం చుట్టిన రామ్ గోపాల్ వర్మ

By BhaaratToday | Published On Apr 19th, 2019

- మరో బయోపిక్ కు శ్రీకారం చుట్టిన రామ్ గోపాల్ వర్మ
- తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించనున్న వర్మ
- టైగర్ కేసీఆర్ పేరుతో టైటిల్ పోస్టర్ విడుదల

వివాదాల ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌రో బ‌యోపిక్‌కు శ్రీకారం చుట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఓ బ‌యోపిక్‌ను వ‌ర్మ తెర‌కెక్కించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం కేసీఆర్ బ‌యోపిక్‌పై రామ్ గోపాల్ వ‌ర్మ‌ దృష్టి సారించారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ ‘టైగ‌ర్ కేసీఆర్’ అనే పేరుతో విడుదల చేశారు. టైటిల్ కింద ‘ది అగ్రెసివ్ గాంధీ, ఆడు తెలంగాణ తెస్త‌నంటే అంద‌రూ న‌వ్విండ్రు’  అని క్యాప్ష‌న్లు పెట్టారు. ఇది కేటీఆర్ తండ్రి బ‌యోపిక్ అని, ఆంధ్రుల‌ పాల‌న‌లో అణిచివేత‌కు గురైన తెలంగాణ ప్ర‌జ‌ల కోసం ఆయ‌న ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ఎలా సాధించారో ఈ సినిమాలో చూపించ‌బోతున్నామని వ‌ర్మ ట్వీట్ చేశారు.