Sunday, August 25, 2019
Follow Us on :

జగన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కేసీఆర్

By BhaaratToday | Published On May 23rd, 2019

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ లో ఫ్యాన్ ఫుల్ జోష్ మీద ఉంది. దాదాపు వైసీపీ విజయం ఖాయమైపోయింది. ఇలాంటి తరుణంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ఫోన్‌ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు వైఎస్‌ జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ముందడుగు వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగు అవుతాయని ఆకాంక్షించారు.

ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టింస్తోంది. వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షులు వైఎస్‌ జగన్‌మోహ‌న్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీ ప్రత్యేక హోదానే మా అజెండా అని వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. కొద్దిసేపటి క్రితం జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ విజయం మేం ఊహించిందేనని అన్నారు. ప్రజలు, దేవుడు వైసీపీనీ ఆశీర్వదించారన్నారు. అలాగే అఖండ విజయం సాధించిన మోదీకి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ గురించి ఏం మాట్లాడుతారని మీడియా అడిగిన ప్రశ్నకు , రాహుల్ గురించి  ఇప్పుడేం మాట్లాడనని చెప్పారు.