Tuesday, May 21, 2019
Follow Us on :

ఒక్కరోజు ప్రచారానికి చంద్రబాబు కేజ్రీవాల్ కు 50 కోట్లు ఇచ్చారా..?

By BhaaratToday | Published On Mar 31st, 2019

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలువురు జాతీయ నాయకులను రంగంలోకి దింపుతున్నారు. ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎన్నికల ప్రచారం కోసం వచ్చారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ కు చంద్రబాబు నాయుడు 50 కోట్ల రూపాయలు ఇచ్చారని కథనాలు ప్రచురితమయ్యాయి.  రెండు రోజుల క్రితం ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన  కేజ్రీవాల్ కు చంద్రబాబునాయుడు రూ. 50 కోట్లను బహుమతిగా ఇచ్చి పంపించారని ఢిల్లీకి చెందిన ఓ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఏపీకి వెళ్లి ప్రచారం చేసి వచ్చినందుకు ఆయనకు మంచి బహుమతి లభించిందని వెల్లడించినట్లుగా ఆ పేపర్ కటింగ్ లో ఉంది. దాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పోస్టు చేశారు.  

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సదరు కథనం చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. "రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లకు వందల కోట్ల ఫండింగ్ ఎలా చేస్తున్నాడని ఢిల్లీలో మీడియా మిత్రులు అడిగారు.13 జిల్లాల చిన్న రాష్ట్రం దేశం మొత్తానికి ఎలక్షన్ నిధులివ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మట్టి, రాయి, ఇసుక నుంచి కూడా బంగారం తీయగల నేర్పరికి అదొక లెక్కా?" అని ప్రశ్నించారు. దీని గురించి తెలుగు ప్రజలు తెగ చర్చించుకుంటూ ఉన్నారు. ఆ పేపర్ కటింగ్ ఎడిటింగ్ చేశారని.. ఫేక్ అని కొందరు వాదిస్తున్నారు.