Tuesday, June 18, 2019
Follow Us on :

కొడుకు మోసం చేసిన అమ్మాయికి.. ఆ తండ్రి ఏమి చేశాడంటే..!

By BhaaratToday | Published On May 21st, 2019

కొడుకు ప్రేమ పేరుతో మోసం చేసిన అమ్మాయికి తగిన న్యాయం చేశాడు ఆ తండ్రి..! తన సొంత కొడుకు చేతిలో మోసపోయిన ఆ యువతికి వేరే వ్యక్తితో పెళ్లి చేయడమే కాదు.. ఏకంగా ఆస్థినే ఆమె పేరు మీద రాశాడు. 


కొట్టాయం జిల్లా తిరునక్కారంకు చెందిన షాజి కుమారుడికి కొన్ని సంవత్సరాల క్రితం ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. వారిద్దరి ప్రేమ వ్యవహారం షాజీకి తెలియగా అప్పట్లో ఇద్దరు మైనర్లు కావడంతో.. మేజర్లైన తర్వాత పెళ్లి చేస్తానని చెప్పాడు. కాలంతో పాటూ షాజీ కుమారుడిలో కూడా మార్పు వచ్చింది. షాజీ కుమారుడు మరో యువతితో ప్రేమలో పడి ఆమెనే పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ ఆ పని కూడా చేయలేదు. షాజీ తన కుమారుడిని మార్చాలని ప్రయత్నించాడు. మొదటి ప్రియురాలితో పెళ్లి చేయాలని కోరుకున్నాడు కానీ అదీ జరగలేదు. ఇద్దరమ్మాయిల్ని మోసం చేసి మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు షాజీ కుమారుడు. అయితే షాజీ తన కొడుకు చేసిన మోసానికి ఓ యువతి జీవితం బలవ్వకూడదని అనుకున్నాడు.    


ఆమెకు మరో యువకుడితో పెళ్లి చేయించాడు. వివాహ వేడుకను బంధువుల మధ్య ఘనంగా నిర్వహించారు. తన పేరు మీదున్న ఆస్తి మొత్తాన్ని యువతి పేరిట రాసిచ్చి కొడుకుకు షాక్ ఇచ్చాడు. షాజీ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

A man marries off his sons ex-girlfriend in Keralas Kottayam