Saturday, October 19, 2019
Follow Us on :

కేరళ కాలేజీ లో పాకిస్థాన్ జెండా..!

By BhaaratToday | Published On Sep 1st, 2019

కేరళలో పాకిస్థాన్ జెండా కలకలం రేపింది. ఏకంగా పాకిస్థాన్ జెండాను ఎగురవేశారంటూ కోజికోడ్‌లోని పెరంబర సిల్వర్ కాలేజీలో 25 మంది విద్యార్థులపై కేసు నమోదైంది. పెరంబర సిల్వర్ కాలేజీలో ముస్లిం స్టూడెంట్ ఫ్రంట్ (ఎంఎస్ఎఫ్), కేరళ స్టూడెంట్ యూనియన్ (కేఎస్‌యూ) విద్యార్థులు పాకిస్థాన్ జెండాను ఎగురవేశారట.. కాలేజీ ఎన్నికల్లో భాగంగా విద్యార్థులు పాక్ జెండాను పట్టుకుని ఎగురవేశారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ జెండా అచ్చం పాకిస్థాన్ జాతీయ జెండాను పోలి ఉండడం.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవడంతో కాలేజ్ క్యాంపస్‌లోకి ఉగ్రవాదులు చొరబడ్డారని, రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతోందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. 

Image result for kerala college

అది పాకిస్థాన్ జెండా ఎట్టి పరిస్థితుల్లోనూ కాదని ఎంఎస్ఎఫ్ విద్యార్థులు చెబుతున్నారు. ఎంఎస్ఎఫ్ జెండా కూడా పాకిస్థాన్ జెండాలానే ఉంటుందని చెబుతున్నారు. జెండా తిరగబడడంతో దానిని పాక్ జెండాగా అనుకుంటున్నారని వారు చెబుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. 

Image result for kerala college