Thursday, August 22, 2019
Follow Us on :

నానీ ట్వీట్ ఎవ‌రిని ఉద్దేశించి? జ‌ట్టు పీక్కొంటున్న త‌మ్ముళ్లు

By BhaaratToday | Published On Jul 14th, 2019

కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సొంత పార్టీ నేతలపై ట్విట‌ర్ వేదిక‌గా సెటైర్లు వేశారు. ఇప్పటికే పలువురు పార్టీ నేతలను టార్గెట్ చేసి ట్వీట్లు చేసిన కేశినేని ఆదివారం జులై 14న కొత్తగా ట్వీట్ చేసారు. ‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు.. నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు.. నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్‌ చేస్తున్నారు....దౌర్బాగ్యం’  అంటూ ట్వీట్‌ చేశారు. 

అయితే.. ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారో అర్ధంకాక తెలుగు త‌మ్ముళ్లు, నెటిజన్లు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఇది టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశిస్తూ చేసిందని కొందరు అంటుంటే.. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను ఉద్దేశించి చేసిందని కొందరంటున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకొద్ది రోజులుగా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఆయన కొత్తగా ట్వీట్ చేస్తున్నందువల్ల ఆయన చేసే ట్వీట్లలో అక్షర దోషాలు బాగా కనపడుతున్నాయి. సో .. నాని వెంకన్నను టార్గెట్ చేసి పోస్టు పెట్టినట్లు ఒక ప్రచారం జరుగుతోంది. విదేశాల్లో చదువుకుని వచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్సి లోకేష్ కు కూడా తెలుగు చదవటం, రాయటం పూర్తి స్ధాయిలో రాదనేది చాలా మందికి తెలిసిన విషయమే. దీంతో లోకేష్ కు మద్దతుగా త‌మ్ముళ్లు నానికి కౌంటర్లు ఇస్తున్నారు.