Sunday, August 25, 2019
Follow Us on :

ఉదయానే మరో సంచలన ట్వీట్ చేసిన కేశినేని నాని.. బాలయోగి ఆస్తులు కాజేశా.. ట్విస్ట్ ఏమిటంటే

By BhaaratToday | Published On Jul 16th, 2019

విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన తాను ఏకంగా బాలయోగి ఆస్తులు కాజేశానని ఒప్పుకున్నారు. అయితే ఆ ఆస్తులు ఏమిటంటే 'నీతి, నిజాయితీ, విలువలు, సిద్ధాంతాలు, ప్రజల్ల పట్ల అంకితభావం, ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి' అని చెప్పడం విశేషం.

ప్రస్తుతం ట్విట్టర్ లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు, కేశినేని నానికి మధ్య గత కొద్ది రోజులుగా ట్విట్టర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో పలు సంచలన ట్వీట్స్ చేశారు నాని..! ఈరోజు కూడా ఆయన తన మీద ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై ట్వీట్ చేశారు. "నేను బాలయోగి ఆస్తులు కాజేశనని ఒక్క ప్రబుద్ధుడు చెప్పింది యదార్థం. బాలయోగి కి ఉన్న ఆస్తులు నీతి, నిజాయితీ, విలువలు, సిద్ధాంతాలు, ప్రజల్ల పట్ల అంకితభావం, ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి. వీటిని కాజేసి, పాటిస్తునందుకు చాలా గర్వ పడుతున్నాను" అని అన్నారు. ఈ ట్విట్టర్ వార్ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.