Tuesday, May 21, 2019
Follow Us on :

కేజీఎఫ్-2 షూటింగ్ మొదలైంది.. రిలీజ్ ఎప్పుడంటే..?

By BhaaratToday | Published On May 14th, 2019

కేజీఎఫ్.. ఈ కన్నడ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు, తమిళం, హిందీలలో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొదటి భాగంలో ఉన్న హీరో ఎలివేషన్ సీన్లు, ఫైట్స్, భారీ విలనిజం చూసి సినీ అభిమానులకు పిచ్చెక్కిపోయింది. మొదటి భాగంలో రాకీ ఎలా ఎదుగుతాడు అన్నది చూపించారు. ఇక రెండో భాగంలో రాకీకి ఎవరు ఎదురు నిలవగలరు అన్నదే పాయింట్. ఇక ఈ సినిమా రెండో భాగం ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. 

బెంగళూరులో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన టీమ్ తో కలిసి షూటింగ్ ను మొదలుపెట్టారు. సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ సెట్స్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం మరింత గ్రాండ్ గా ఉంటుందని.. అంచనాలను తప్పకుండా అందుకుంటామని ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాకింగ్ స్టార్ యశ్ చెప్పుకొచ్చారు. చాఫ్టర్-2 మొదటి భాగం కంటే మరింత గొప్పగా ఉంటుందని యశ్ హామీ ఇచ్చారు. మొదటి భాగంలోనే కొన్ని సన్నివేశాలు(హెలీకాఫ్టర్ లో రాకీ భాయ్ కోసం రావడం లాంటివి) చూపించి రెండో భాగం ఏ రేంజిలో ఉంటుందో చిన్న హింట్ ఇచ్చారు. ఇక సినిమా విడుదల కావడానికి ఒకటిన్నర సంవత్సరం పట్టే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు.