Saturday, December 14, 2019
Follow Us on :

లండన్ లో అదృశ్యమైన తెలంగాణ బీజేపీ నాయకుడి కుమారుడు.. చివరికి..!

By BhaaratToday | Published On Sep 3rd, 2019

ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉదయ్ ప్రతాప్ కుమారుడు శ్రీహర్ష కొద్దిరోజుల ముందు లండన్ లో అదృశ్యమయ్యాడు. విద్యాభ్యాసం నిమిత్తం లండన్ కు వెళ్లిన శ్రీహర్ష, గత నెల 21న సముద్రం వద్దకు వెళ్లి అదృశ్యమయ్యాడు. అతడు ఎలాగైనా క్షేమంగా వస్తాడని కుటుంబసభ్యులు, స్నేహితులు ఆశించారు. అయితే శ్రీహర్ష ప్రాణాలతో తిరిగిరాలేదు. శ్రీహర్ష  మృతదేహం లండన్ బీచ్ సమీపంలో ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. 

లండన్ బీచ్ సమీపంలో ఓ మృతదేహం ఒడ్డుకు కొట్టుకు రాగా, స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు, మృతదేహాన్ని శ్రీహర్షదిగా గుర్తించారు. 

శ్రీహర్ష మృతదేహం లభ్యమైందన్న విషయం తెలియగానే వారి కుటుంబంలోనూ సన్నిహితుల్లో విషాదఛాయలు అలముకున్నాయి. పలువురు బీజేపీ నేతలు ఉదయ్ ప్రతాప్ ను పరామర్శించేందుకు వచ్చారు. వీలైనంత త్వరగా శ్రీహర్ష మృతదేహాన్ని ఇండియాకు తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

Image result for khammam bjp